Homeమెదక్‌Padma Devender Reddy | బాధిత కుటుంబాలకు పరామర్శ

Padma Devender Reddy | బాధిత కుటుంబాలకు పరామర్శ

మాజీ డిప్యూటీ స్పీకర్(Ex Deputy Speaker), బీఆర్ఎస్ పార్టీ (Brs Party) మెదక్ జిల్లా అధ్యక్షురాలు (Medak District Chief) ఎం.పద్మాదేవేందర్ రెడ్డి.. నిజాంపేట మండలం (Nizampet Mandal) నస్కల్ గ్రామానికి వచ్చారు. ఆ ఊరులోని లాలాగౌడ్ విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతిచెందగా బాధిత కుటుంబాన్ని (family of victims) బుధవారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి లాలాగౌడ్ భార్యను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాలాగౌడ్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

581771970 1365622578297327 2839993196122519477 n

అనంతరం.. బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మల్లేశం తండ్రి ఎర్ర మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్ రెడ్డి బచ్చురాజుపల్లి చేరుకొని ఎర్ర మల్లయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీరి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, నిజాంపేట పీఏసీఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ గౌస్, నాయకులు యాదగిరి, వెంకటస్వామి గౌడ్ నరేందర్ నాయక్, సుభాష్ నాయక్, పత్తి నాయక్, రాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News