Wednesday, February 25, 2026
Homeహైదరాబాద్‌GHMC | శ్రీ రామకృష్ణ పురం డివిజన్ లో పర్యటించిన

GHMC | శ్రీ రామకృష్ణ పురం డివిజన్ లో పర్యటించిన

  • జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి..

శ్రీ రామకృష్ణ పురం డివిజన్, (35)విజయపూరి కాలనీలో గత కొన్ని రోజులుగా వర్షపు నీరు, డ్రైనేజీ పొంగి పొర్లుతూ దుర్భరమైన వాసనతో కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ లని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు..

ఈ సందర్బంగా ఆమె స్పందించి జిహెచ్ఎంసి అధికారలను ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యను పరిష్కారం చేయాలని ఆమె కోరడంతో స్పందించిన జీ.హెచ్.ఎం.సి. అదనపు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సమస్య ఆ ప్రాంతంలో మంగళవారం రోజు పర్యటించారు.. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు..

- Advertisement -

ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్, సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసులు, సరూర్ నగర్ సర్కిల్ ఇంజనీర్ విభాగం ఎస్సీ, ఈఈ, డీఈ, ఏఈఈ లతోపాటు జీ.హెచ్.ఎం.సి. అధికారులు, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్., వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News