Tuesday, November 11, 2025
ePaper
Homeస్పోర్ట్స్Tea Break | టెస్ట్ మ్యాచ్‌లో ఫస్టు టీ బ్రేక్

Tea Break | టెస్ట్ మ్యాచ్‌లో ఫస్టు టీ బ్రేక్

ఇండియా-సౌతాఫ్రికా సిరీస్ నుంచి కొత్త పద్ధతి ప్రారంభం
నవంబర్ 22న ఈ రెండు దేశాల మధ్య రెండో టెస్ట్

మామూలుగా అయితే టెస్ట్ మ్యాచ్‌(Test Match)లో మొదట లంచ్ బ్రేక్ (Lunch Break) ఇస్తారు. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. కానీ నవంబర్ 22 నుంచి గువాహటి(Guwahati)లో ప్రారంభంకానున్న ఇండియా-సౌతాఫ్రికా (India-South Africa) రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి కొత్త పద్ధతి(New method)కి శ్రీకారం చుడుతున్నారు. ముందుగా లంచ్ బ్రేక్‌కి బదులు టీ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు. అక్కడి ప్రత్యేక వాతావరణం (Special Atmosphere) వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. గువాహటిలో పొద్దు పొడవటం, పొద్దు గూకటం త్వరగా జరుగుతాయి.

సహజంగా 90 ఓవర్ల టెస్ట్ మ్యాచ్‌లో 3 సెషన్లు ఉంటాయి. తొలి సెషన్ (9 గంటల నుంచి 11 గంటల వరకు) పూర్తి కాగానే ఇండియాలో అయితే ముందుగా లంచ్ బ్రేక్ (11 గంటల నుంచి 11.20 వరకు) ఇస్తారు. ఆ సంప్రదాయం ఇప్పుడు మారబోతోంది. రెండో సెషన్ 11.20 నుంచి 1.20 వరకు ఉంటుంది. లంచ్ బ్రేక్ 1.20 నుంచి 2 గంటల వరకు ఇస్తారు. మూడో సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ఈ కొద్ద పద్ధతిని గువాహటి టెస్ట్‌కు మాత్రమే పరిమితం చేస్తారా? లేక, మన దేశంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు వర్తింపజేస్తారా అనేది మాత్రం తెలియదు. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News