Homeమహబూబ్‌నగర్‌Elections | మొదటి విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

Elections | మొదటి విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

  • ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తొలివిడత ఎన్నికలు జరిగే గోపాల్ పేట, రేవల్లి మండలాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తుది జాబితాలో నిలిచిన పోటీ చేసే అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులను తెలిపార లేద అని అడిగి తెలుసుకున్నారు.

Collector Adarsh Surabhi Reviews First Phase Election Arrangements

మెటీరియల్ పంపిణీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయవలసిన వసతులు, పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, రూట్ వారిగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అవగాహన కల్పించి ఆప్రమత్తం చేశారు. ఎన్నికలు పూర్తి అయి ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచి ఎంపిక, తిరిగి బ్యాలెట్ బాక్స్ లు రిసెప్షన్ సెంటర్లో అప్పగించే వరకు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గోపాల్ పేట ఎంపీడీవో హయేషా అజుమ్, తాసిల్దార్ తిలక్ రెడ్డి, రేవల్లి ఎంపీడీవో కీర్తన, తాసిల్దార్ లక్ష్మి ఎంపీ ఓ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News