- రైతులకు సాగులో మెలకువలపై అవగాహన కల్పించిన ప్రొఫెసర్లు
అలియాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని సంజీవ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరి ఎమ్ టీ యు 1010 రకం పై క్షేత్ర దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సొంత విత్తన అభివృద్ధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువల పై రైతులకు పలు సలహాలు, సూచనలు అందచేశారు.

అదే విధంగా పండించిన విత్తనాలను తమ తోటి రైతులకు అందించాలని సూచించారు. అధిక దిగుబడులు ఇచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని చంద్రకళ, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుధీర్, రవి, రైతులు జగన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తునికి బిక్షపతి, సుధాకర్ రెడ్డి, హరి శంకర్ గౌడ్ , తునికి రమేష్, బండి రాంరెడ్డి, కుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
