Thursday, May 7, 2026
Homeసాహిత్యంFatherhood | నాన్నతనం

Fatherhood | నాన్నతనం

నాన్న అనిపించుకుంటేనే..
ఆయన జన్మకు పూర్ణత్వం
ఆలి ప్రసవ వేదనకు..
తల్లడిల్లు ఆయన హృదయం !

నవజాత శిశువు ఏడుపు వినగానే..
నాన్నలో ఉప్పొంగు ఆనంద భాష్పాలు
తండ్రి ప్రేమ అదృశ్య ప్రాణవాయువు
నాన్నతనం ఓ నిశ్శబ్ద తరంగం !

- Advertisement -

అమ్మ తొలి పలుకు, నడక నేర్పితే..
నాన్న చేయిపట్టి నడత నూరిపోస్తాడు
తెర ముందు అమ్మతనం పొగడ్త
తల్లిబిడ్డలకు నాన్నే అభయ హస్తం !

తగిన గుర్తింపు లేని పాత్ర నాన్న
కుటుంబానికి ఆయనే తోడు నీడ
కన్నీటిని చెమట వరదగా పారించి..
కుటుంబ పంటకు నీరు పోస్తాడు !

అమ్మ ఇంటి నవ్వుల దీపం
నాన్న ఆ దీపానికి కాలిపోయే వత్తి
కుటుంబానికి వెన్నెముక బాపు
నిత్యం శ్రమించే మానవ యంత్రం!

అపూర్వ పేగుబంధం అమ్మది
అద్వితీయ త్యాగబంధం నాన్నది
అమ్మనాన్నలు ఆది దేవతలు
ప్రత్యామ్నాయమే లేని పాత్రలు !

- Advertisement -
RELATED ARTICLES

Latest News