Homeఆదాబ్ ప్రత్యేకంSainikpuri Bhavans | సైనిక్‌పురి భవన్స్‌లో లెక్కలేనన్ని అక్రమాలు..?

Sainikpuri Bhavans | సైనిక్‌పురి భవన్స్‌లో లెక్కలేనన్ని అక్రమాలు..?

  • సైనిక్‌పురి భవన్స్ వ్యవహారాలపై కమిటీని నియమించాలి..
  • ట్రస్ట్ భూమి వాణిజ్య, అనధికార వినియోగంపై ఆరోపణలు
  • అధికారుల నిర్లక్ష్యం, విచారణ లేకపోవడంపై ప్రశ్నలు
  • పీటీ పిల్లి రాము పై అధికార దుర్వినియోగం ఆరోపణలు
  • ప్రభుత్వ లీజు నిబంధనలకు తూట్లు పొడుస్తున్న యాజమాన్యం
  • విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్న ఆందోళన
  • ముంబై హెడ్ ఆఫీస్ స్పందన లేకపోవడం శోచనీయం
  • లీజు నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

భారతీయ సంస్కృతికి, విలువలతో కూడిన విద్యకు మారుపేరుగా నిలిచిన ‘భారతీయ విద్యా భవన’ నేడు సైనిక్‌పురి శాఖ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ప్రజా ప్రయోజనాల కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో నెలకొన్న భవన్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తలు విద్యావేత్తలను, తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో భవన్స్ కు సంబంధించిన ఇతర విద్యాలయాలు కూడా ఉన్నాయి.. కానీ కేవలం సైనిక్ పురి భవన్స్ లోనే లెక్కలేనన్ని ఆరోపణలు రావడం ఏమిటి..? దీనికి కారణభూతమైన వ్యక్తిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నది ఇప్పుడు విశ్లేషకుల వాదన.. ఆ వ్యక్తిని ఎవరు కాపాడుతున్నారు..? ఈ అక్రమాల వెనుక ఏమి జరుగుతోంది..? ఇవన్నీ వెలుగుచూడాల్సిన వాస్తవాలు..

ప్రభుత్వం ట్రస్ట్ పేరు మీద భూమిని కేటాయించేది సామాజిక బాధ్యతతో కూడిన విద్యాసంస్థలను నడపడానికే. కానీ, సైనిక్‌పురి భవన్స్‌ను కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం, ఇష్టానుసారం వాడుకుంటున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. విద్యాపర మైన అవసరాలకు కాకుండా, వాణిజ్యపరమైన లేదా అనధికారిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -
Sainikpuri Bhavans Faces Allegations of Irregularities and Mismanagement1

మౌనముద్రలో అధికార యంత్రాంగం,
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్ :

ప్రభుత్వ భూమి దుర్వినియోగం అవుతున్నప్పుడు ‘రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస’, విద్యాశాఖ మౌనంగా ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు?.. స్థానిక అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, క్షేత్రస్థాయిలో విచారణ జరగకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైనిక్ పురి భవన్స్ కు ఇచ్చిన లీజు నిబంధనలను ఉల్లంఘిస్తే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ, ఇక్కడ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇకపోతే ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న భవన్స్ మేనేజ్‌మెంట్, సైనిక్‌పురిలో జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోవడం ఆశ్చర్యకరం. ఇది దూరా భారమా? లేక నిర్లక్ష్యమా? సైనిక్ పూరి భవన్స్ ను శాసిస్తున్న పీటీ పిల్లి రాము ప్రలోభాలకు లొంగిపోయారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. దూరంగా ఉండటం వల్ల ఇక్కడి పరిస్థితులు వారికి తెలియడం లేదా? లేక స్థానిక యాజమాన్యం పంపే తప్పుడు నివేదికలను వారు నమ్ముతున్నారా? కాగా అవినీతిలో ముంబై పెద్దలకు కూడా వాటా ఉందనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వారు తక్షణమే ఒక స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

’పీఈటీ’ పిల్లి రాము ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.. పాఠశాలలో ఒక సాధారణ పీఈటీ పిల్లి రాము అనే వ్యక్తిపై వస్తున్న ఆరోపణలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.. సంస్థను శాసిస్తున్నారనే వార్త సంస్థ పతనాన్ని సూచిస్తోంది. ఈయనగారి అక్రమాలను ప్రశ్నించిన దాదాపు 35 మంది సిబ్బందిని, నిబద్ధత గల ఉద్యోగులను అకారణంగా తొలగించడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది విద్యా సంస్థలో ఉండాల్సిన స్వేచ్ఛను హరిస్తోంది.

కాగా సదరు పీటీ పిల్లి రాము, సెంట్రల్ ఆఫీస్ ఉద్యోగిని పులకంటి స్వప్నలు కలిసి జూనియర్ కాలేజీ అటెండర్ ఉగ్రపల్లి రామారావు, కేంద్ర కార్యాలయం కేర్ టేకర్ బి. కుమార్, అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి భోగేశ్వర రావు, మెడికల్ కాలేజీ సూపెరిండేంట్ శారదా హాస్పిటల్, డాక్టర్ అడ్వైజర్ కోటా రామారావు వంటి వారిని తమ కనుసన్నలలో నడిపించుకుంటూ తమ దోపిడీ పర్వాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని తొలగించబడిన ఉద్యోగులు ఆవేదన చెందుతూ ఆరోపిస్తున్నారు..

Sainikpuri Bhavans Faces Allegations of Irregularities and Mismanagement

దారుణమైన విషయం ఏమిటంటే భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఎయిర్ కమాండర్ జె.ఎల్.ఎన్. శాస్త్రి 2024 ఫిబ్రవరి 12న ఒక ప్రోగ్రాంలో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.. అదే విధంగా ఇతర అనారోగ్య కారణాలతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇక ఆయన కుమార్తె లక్క్ష్మీదేవి, ఉస్మానియా యÖనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి, భవన్స్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన మేధావి.

అలాంటి వ్యక్తిని పిల్లి రాము తన మాయమాటలతో, బ్లాక్ మెయిలింగ్‌తో మానసిక క్షోభకు గురిచేసి, నేడు మతిస్థిమితం లేని వ్యక్తిగా మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఆమె కొడుకును కూడా మతిలేని వాడిగా మార్చివేశారు పిల్లి రాము అతని గ్యాంగ్ అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శాస్త్రి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన ఆయన స్థానంలో సైనిక్ పురి భవన్స్ కి రమణయ్య అనే ఒక వయసు మీరిన వ్యక్తిని, ఇతను ఇంతకు ముందు గ్రూప్ కో ఆర్డినేటర్ గా విధులు నిర్వహించేవాడు.. ఇతనిని హానరబుల్ సెక్రెటరీ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి సదరు రమణయ్యను ఆ పోస్ట్ లో నియమించుకుని అతని సంతకాలతో లెక్కలేని అవినీతి కార్యకలాపాలు చేస్తున్నాడని ఆరోపణలు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సదరు రమణయ్యకు సుమారు 89 సంవత్సరాల వయసు ఉంటుంది.. అతడికి వినికిడి లోపం ఉంది.. రెండు చెవులూ పనిచేయవు..

అలాగే అతని రెండు మోకాళ్ళ చిప్పలకు ఆపరేషన్ జరిగింది.. ఇంకా ఇతరత్రా అనారోగ్య సమస్యలు వున్నాయి.. తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకునే శక్తి లేదు.. నడవగలిగే శక్తి కూడా లేదు.. ఇద్దరు పట్టుకుని లేపితే గానీ లేవలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి తన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడు..? కేవలం అతన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేయడానికి మాత్రమే రమణయ్యను నియమించుకున్నాడు పిల్లి రాము..

కాగా ఇతగాడు రమణయ్య ఇంట్లో పనిచేస్తాడు.. కాలేజీలో తన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, పీటీ గా, వైస్ చైర్మన్ విధులు నిర్వహించకుండా రమణయ్య ఇంటిలోనే తిష్టవేసి తన అవినీతి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడని తెలుస్తోంది.. ఒక వ్యక్తి వ్యవస్థను మించి వ్యవహరిస్తుంటే, ఎవరు కూడా ఎందుకు అడ్డుకోవడం లేదన్నది ప్రశ్నార్థకం. అయితే కొంతమందిని అక్రమంగా తానే నియమించుకుని, వారిని తన కొఠరీగా ఏర్పాటు చేసుకుని అక్రమ వ్యవహారాలు నడిపిస్తున్నాడన్నది నిర్విదాంశం..

ప్రభుత్వ కర్తవ్యం :

సమగ్ర విచారణ చేపట్టాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్, ఐజీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వారు సంబంధిత అధికారులతో తక్షణమే ఒక హై`లెవల్ ఎంక్వయిరీ కమిటీని నియమించాలి. గత కొన్నేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. భూమి లీజు సమీక్ష చేయించాలి. సైనిక్‌పురి భవన్స్‌కు ప్రభుత్వం కేటాయిం చిన లీజు నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠినచర్యలు తీసుకోవాలి.

ముంబై హెడ్ ఆఫీసు బాధ్యత :

ముంబై నుండి ఒక ప్రత్యేక బృందాన్ని పంపి, స్థానిక సిబ్బంది, విద్యార్థుల తల్లి దండ్రులతో నేరుగా మాట్లాడాలి. అవినీతి ఆరో పణలు ఎదుర్కొంటున్న పీటీ పిల్లి రాము అతని సహచరులైన అక్రమార్కులను వెంటనే విధులనుంచి తప్పించి విచారణ జరపాలి.

ఈ అంశాన్ని కేవలం ఒక స్కూల్ సమస్యగా కాకుండా, లీజు విషయంలో గలీజు వ్యవహారం, విద్యా వ్యవస్థ ప్రక్షాళనగా చూడాలి. న్యాయస్థానంలో ‘పిల’ దాఖలు చేయడం ద్వారా న్యాయ విచారణకు ఒత్తిడి తీసుకురావాలి. విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు, అక్రమాలకు అడ్డాగా మారడం సమాజానికే ప్రమాదకరం. ‘సైనిక్ పురి భవన్స్ ‘తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలంటే, ప్రక్షాళన కింద స్థాయి నుండే మొదలవ్వాలి. ప్రభుత్వం, ప్రధాన యాజమాన్యమైన ముంబై హెడ్ ఆఫీసు వారు తక్షణమే స్పందించకపోతే, విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంగా మారే ప్రమాదం ఉంది.

కేవలం విద్యను మాత్రమే కాకుండా సైనిక్ పురి భవన్స్ ఆటలకు, వైద్యానికి, సాంస్కృతిక సంరక్షణకు ఆలవాలంగా నిలుస్తోంది.. ఇక్కడ క్రికెట్ అకాడమీ, మెడికల్ కాలేజ్, శారదా హాస్పిటల్ లాంటి అత్యున్నత ప్రమాణాలతో సేవలు లభిస్తున్నాయి.. ఇప్పుడు తలెత్తిన అవినీతి వ్యవహారం ఈ విషయాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సైనిక్ పురి భవన్స్‌లో నెలకొన్న మరిన్ని భయంకర వాస్తవాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది

‘ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News