Monday, June 22, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..

Aaj Ki Baath | నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..
అనే మాటలు హృదయాన్ని కదిలిస్తాయి..
అమ్మ జన్మనిస్తే… ఆ జన్మకు ఒక సార్థకతను..
ధైర్యాన్ని ఇచ్చే అభయహస్తం నాన్న..
ప్రేమకు రూపం అమ్మ అయితే.. ఆ ప్రేమను
గుండెల్లో దాచుకుని కుటుంబ భారాన్ని మోసే
త్యాగశీలి నాన్న.. పిల్లల పెదవులపై చిరునవ్వు
కోసం.. వారి భవిష్యత్తు వెలుగుల కోసం
తన సుఖాలను, సంతోషాలను నిశ్శబ్దంగా త్యాగం
చేసే నిగర్వి ఆయన. పిల్లల ప్రతి అడుగులోనూ
నీడలా వెన్నంటి నడుస్తూ, జీవితంలో
ఎలా గెలవాలో నేర్పే ఒకే ఒక్క
ఆదర్శం తండ్రి. తండ్రి ఆరోగ్యమే ఆ ఇంటిల్లిపాదికీ
కొండంత అండ, శ్రీరామరక్ష.
ఆయన నిండు నూరేళ్ల ఆరోగ్యవంతమైన
జీవితమే ఆ కుటుంబానికి లభించే
అసలైన సుఖసంతోషాల నందనవనం.
బాధ్యతకు నిలువెత్తు నిదర్శనమై,
కుటుంబానికి వేరులా నిలిచే
నాన్నకు పాదాభివందనం..

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..
అనే మాటలు హృదయాన్ని కదిలిస్తాయి..
అమ్మ జన్మనిస్తే… ఆ జన్మకు ఒక సార్థకతను..
ధైర్యాన్ని ఇచ్చే అభయహస్తం నాన్న..
ప్రేమకు రూపం అమ్మ అయితే.. ఆ ప్రేమను
గుండెల్లో దాచుకుని కుటుంబ భారాన్ని మోసే
త్యాగశీలి నాన్న.. పిల్లల పెదవులపై చిరునవ్వు
కోసం.. వారి భవిష్యత్తు వెలుగుల కోసం
తన సుఖాలను, సంతోషాలను నిశ్శబ్దంగా త్యాగం
చేసే నిగర్వి ఆయన. పిల్లల ప్రతి అడుగులోనూ
నీడలా వెన్నంటి నడుస్తూ, జీవితంలో
ఎలా గెలవాలో నేర్పే ఒకే ఒక్క
ఆదర్శం తండ్రి. తండ్రి ఆరోగ్యమే ఆ ఇంటిల్లిపాదికీ
కొండంత అండ, శ్రీరామరక్ష.
ఆయన నిండు నూరేళ్ల ఆరోగ్యవంతమైన
జీవితమే ఆ కుటుంబానికి లభించే
అసలైన సుఖసంతోషాల నందనవనం.
బాధ్యతకు నిలువెత్తు నిదర్శనమై,
కుటుంబానికి వేరులా నిలిచే
నాన్నకు పాదాభివందనం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News