Homeనిజామాబాద్‌Fake Seeds | నకిలీ విత్తనాల పై చర్యలు తీసుకోవాలి..!

Fake Seeds | నకిలీ విత్తనాల పై చర్యలు తీసుకోవాలి..!

  • నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి..!
  • భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విట్టల్ రెడ్డి

తాడ్వాయి: నకిలీ, నాసిరకం విత్తనాలతో(Fake Seeds) నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విట్టల్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన విత్తన వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతులతో కలిసి తహసీల్దార్ శ్వేత, వ్యవసాయ అధికారి (ఏఓ) నర్సింలుకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విట్టల్ రెడ్డి మాట్లాడుతూ.. తాడ్వాయి మండల కేంద్రంతో పాటు చందాపూర్, బ్రహ్మాజీవాడి, దేమి, కృష్ణాజీవాడి, కంకల్, కరేడ్పల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులకు దేమికలాన్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కమిట్‌మెంట్‌పై రాజ్మా (బిర్నిస్) విత్తనాలను విక్రయించాడని తెలిపారు. అయితే, ఆ విత్తనాలు నాసిరకంగా ఉండటంతో పొలాల్లో మొలకెత్తలేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

విత్తనాల కొనుగోలు కోసం రైతులు పెట్టుబడితో పాటు సాగు పనులకు చేసిన ఖర్చులను కూడా నష్టపోయారని పేర్కొన్నారు. సదరు వ్యాపారి నుంచి రైతులకు పెట్టుబడి మొత్తం తిరిగి ఇప్పించడంతో పాటు అదనపు నష్టపరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, నష్టపరిహారం చెల్లించకపోతే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం రైతులు పైడి సుగుణకర్ రెడ్డి,మొద్దు నరేష్, సాయిలు, అవుతుల్ల, రమేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
Farmers Demand Compensation Over Spurious Rajma Seeds0 1

బిల్లులు, లేబుళ్లు లేని విత్తనాలపై చర్యలు తీసుకోవడం కష్టం: ఏఓ నర్సింలు

రాజ్మా (బిర్నిస్) విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయినట్లు కొందరు రైతులు తమకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయ అధికారి నర్సిములు తెలిపారు. దేమికలాన్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి( కమిట్‌మెంట్‌)పై పలువురు రైతులకు విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ప్యాకింగ్‌పై కంపెనీ పేరు, లేబుల్, ఇతర వివరాలు స్పష్టంగా ఉన్న ధ్రువీకృత విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. బిల్లులు, లేబుళ్లు లేని విత్తనాల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇకపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని ఏఓ నర్సింహులు సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News