- కొడంగల్‌కు ప్రత్యేక బస్సులు.. జెండా ఊపి ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
శంకర్పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో కొడంగల్‌లో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా – అగ్రో ఇండస్ట్రియల్ ఎక్స్పో 2026(Mega Rythu Mela) కార్యక్రమానికి శంకర్పల్లి మండలం నుంచి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ,రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలు,ప్రభుత్వ పథకాలపై అవగాహన పొందేందుకు మహిళా రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.
ఈ సందర్భంగా కొడంగల్‌కు బయలుదేరిన రైతుల ప్రత్యేక బస్సులకు డీసీసీ ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి,శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు,పర్వేద సర్పంచ్ సురేందర్ గౌడ్,పీఏసీఎస్ చైర్మన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకటరెడ్డి, మోకిల పీఏసీఎస్ చైర్మన్ గౌండ్ర సత్యం జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం నాయకులు సైతం రైతులతో కలిసి కొడంగల్‌కు బయలుదేరారు.వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులు,నూతన సాంకేతికతను రైతులకు పరిచయం చేయడంతో పాటు,వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ఇటువంటి రైతు మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళా రైతులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త సాగు విధానాలు,ఆధునిక వ్యవసాయ పరికరాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంతప్పగూడ సర్పంచ్ బీరయ్య,టంగుటూరు సర్పంచ్ హరిత కృష్ణారెడ్డి,మోకిల సర్పంచ్ శేఖర్,పొద్దుటూరు సర్పంచ్ లక్ష్మీనరసింహ,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఏఈఓ చైతన్య,ఏపీఎం రవీందర్,సీసీ చంద్రయ్య, పర్వేద పంచాయతీ కార్యదర్శి వసంత,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,రైతులు,మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
