హుజూర్ నగర్ (పాలకవీడు): పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిలభారత రైతు సంఘం మహాసభలను జయప్రదం(AIKS Conference) చేయాలని సీపీఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
గతంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిలభారత రైతు సంఘం దేశవ్యాప్తంగా రైతులను సమీకరించి అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు.రైతులు, కార్మికులు,వ్యవసాయ కూలీల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జరిగే ఈ మహాసభల ప్రారంభం సందర్భంగా ఈ నెల 15న నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి రైతు రణభేరిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్,మాతంగి ఏసురత్నం,డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి రమేష్,యోహాన్,వెంకయ్య,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
