Homeఆదాబ్ ప్రత్యేకంNalgonda | సర్టిఫికెట్ ఫేక్.. సంతకం ఫేక్..

Nalgonda | సర్టిఫికెట్ ఫేక్.. సంతకం ఫేక్..

  • నల్గొండ వైద్యశాఖలో నకిలీ స్పౌజ్ సర్టిఫికెట్ కలకలం
  • సర్టిఫికెట్‌పై సంతకం ఫోర్జరీ అని మాజీ అధికారి స్పష్టం
  • గోవింద్ నాయక్ స్పందించక పోవడంపై పెరుగుతున్న అనుమానాలు..
  • సమగ్ర విచారణ, కఠిన చర్యలకు ఉద్యోగ సంఘాల డిమాండ్

నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వెలుగుచూసిన ‘నకిలీ స్పౌజ’ సర్టిఫికెట్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఒక ఏఎనఎం బదిలీ కోసం సృష్టించిన తప్పుడు పత్రాలు, వ్యవస్థలో జరుగుతున్న అక్ర మాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై సంచలన నిజాలు వెలుగులోకి రాగా, ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీస్ సూపరింటెండెంట్ డి. గోవింద్ నాయక్ మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తోంది.

Fake Spouse Certificate Forgery Controversy Nalgonda

డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి స్పష్టీకరణ: “ఇది పూర్తిగా నకిలీ”

గతంలో డిటిసిఓగా పనిచేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సదరు సర్టిఫికెట్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రస్తుత రంగా రెడ్డి జిల్లా టీబీ కంట్రోల్ అధికారిగా ఉన్న ఆయన ఈ పత్రం గురించి మాట్లాడుతూ.. సదరు స్పౌజ్ సర్టిఫికెట్ గురించి తనకు ఎటువంటి అవగాహన లేదని, దానిని జారీ చేసే అధికారం 2026లో తనకు లేదని స్పష్టం చేశారు. ఈ ధృవీకరణ పత్రంపై ఉన్న సంతకం ఫోర్జరీ (నకిలీ) అని, పత్రంపై క్లర్క్, సూపరింటెండెంట్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సంతకాలు కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు.
స్పందించని గోవింద్ నాయక్

- Advertisement -
Fake Spouse Certificate Forgery Controversy Nalgonda1

బలపడుతున్న ఆరోపణలు..

ఈ అక్రమ బదిలీల వెనుక ఆఫీస్ సూపరింటెం డెంట్ డి. గోవింద్ నాయక్ పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయన భార్య పేరు ‘ధరావత్ సునీత’ అని స్పష్టంగా ఉన్నప్పటికీ, రికార్డులను తప్పుదోవ పట్టించి కే. రమణికి అనుకూలంగా ఈ నకిలీ పత్రాన్ని రూపొందించారనేది ప్రధాన ఆరోపణ.

ఈ విషయమై ‘ఆదాబ్ హైదరాబాద’ ప్రతినిధి డి. గోవింద్ నాయక్‌ను లిఖితపూర్వకంగా వివరణ కోరారు. అయితే, ఎన్నో ఆధారాలు బయటపడుతున్నా, ఉన్నతాధికారుల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నా ఆయన నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి నిరాకరించడం, ఆయనపై ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తోంది.

Fake Spouse Certificate Forgery Controversy Nalgonda3

సమగ్ర విచారణకు డిమాండ్..

ఈ స్థాయిలో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు పత్రాల సృష్టి జరుగుతున్నా జిల్లా అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. కే. రమణి, సుజాతలకు సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లు, ఎంప్లా యిస్ హెల్త్ స్కీమ్ రికార్డులను వెంటనే పరిశీలించాలి. సంబంధిత సిబ్బంది పిల్లల స్కూల్ రికార్డులు, నామినీ వివరాలను క్షుణ్ణంగా ఎంక్వయిరీ చేయాలి. నకిలీ పత్రాలు సృష్టించిన వారిని, అధికా రుల సంతకాలను ఫోర్జరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

”షాడో డీఎంహెచఓ”గా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవింద్ నాయక్ వ్యవహారంపై అధికారు లు తక్షణమే స్పందించకపోతే, వ్యవస్థ పట్ల ఉద్యోగులకు నమ్మకం పోతుందని హెచ్చరికలు అందుతున్నాయి. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు పొందడం అనేది తీవ్రమైన నేరమని, దీనిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News