Friday, June 5, 2026
Homeఆరోగ్యంTea Detox | 30 రోజులు టీ తాగడం మానెయ్యండి..

Tea Detox | 30 రోజులు టీ తాగడం మానెయ్యండి..

  • ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి..
  • రీ బూట్ ప్రక్రియకు శరీరం లోనవుతుంది..

చాయ్‌.. పానీయం మాత్రమే కాదు. జీవితంలో ఒక భాగం కూడా. అయితే మన ఆరోగ్యం విషయంలో ఎదురయ్యే సమస్యలకు టీ కూడా ఒక కారణమని చాలామందికి తెలియదు. టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఒక 30 రోజులు చాయ్‌కు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలను పరిశీలిద్దాం..

30 రోజులు టీ మానేస్తే శరీరం అద్భుతమైన రీబూట్‌ ప్రక్రియకు లోనవుతుంది. ఈ మార్పు బాహ్య సౌందర్యానికే కాకుండా శరీరంలోని ప్రతి కణాన్నీ పునరుజ్జీవింపజేస్తుంది. ముఖంపై సహజమైన కాంతి రావడం నుంచి, మొండి మొటిమలు, మచ్చలు తగ్గడం వంటి మార్పులెన్నో చోటుచేసుకుంటాయి. కళ్ల కింద నలుపు మాయమై, ముఖం యవ్వనంగా మారుతుంది. లోలోపల అవయవాలు కూడా మరింత చురుగ్గా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, మంచి నిద్రపట్టడంతోపాటు తెలియకుండానే మనలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.

- Advertisement -

టీలో ఉండే కెఫీన్‌ మన శరీరం నుంచి నీటిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. కాబట్టి టీ మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉండి, చర్మకణాలకు తగిన తేమ అందుతుంది. తద్వారా ముఖం, బుగ్గలు తాజాగా మెరుస్తూ ఉంటాయి. టీ వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు, దురద, వాపు, గుల్లలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. టీ మానేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా చకెర ఎకువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొలాజెన్‌, ఎలాస్టిన్‌ అనే ప్రొటీన్లు దెబ్బతింటాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News