Homeఆరోగ్యంRagi Java | రాగి అంబలి.. ఇది అమృతం..

Ragi Java | రాగి అంబలి.. ఇది అమృతం..

  • విశిష్ట గుణాలున్న రాగి.. ప్రతిరోజూ తీసుకోండి..Ragi Java
  • బరువు తగ్గాలనుకునే వారికి రాగి ఒక దివ్యమైన ఔషధం..

ధాన్యపు గింజల్లో రాగులు అత్యంత ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. కారణం వాటిలో నిక్షిప్తమై ఉన్న అపారమైన పోషక పదార్థాలే. రాగి సంగటిని ఆరగించడం లేదా రాగి అంబలిని (Ragi Java) తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగులతో తయారుచేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాగులు కాల్షియం, ఐరన్, డైటరీ ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పోషకమైన చిరుధాన్యం. కార్బోహైడ్రేట్లతోపాటు.. పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, బి-విటమిన్లు, అమైనో ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. ఎముకల ఆరోగ్యానికి, ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతాయి.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలై ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

- Advertisement -

రాగులతో తయారుచేసే అంబలిని తాగడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధం.. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని అందిస్తుంది. రోజంతా శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు ఈ రాగి అంబలి ద్వారా సమృద్ధిగా లభిస్తాయి. రాగి అంబలికి చలువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన అధిక వేడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. కేవలం ఒక గ్లాసు రాగి అంబలి తాగినా చాలాసేపు ఆకలి వేయదు, దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు రాగి అంబలిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. రాగి అంబలి మీ దైనందిన ఆరోగ్యానికి శక్తినిస్తుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News