Wednesday, April 15, 2026
Homeరంగారెడ్డిKistapur | డ్రైనేజీ పొంగి పొర్లడంతో దుర్వాసన వెదజల్లుతుంది.

Kistapur | డ్రైనేజీ పొంగి పొర్లడంతో దుర్వాసన వెదజల్లుతుంది.

  • మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్

కిష్టాపూర్ పూడూర్ సర్కిల్ పరిధిలోని కిష్టాపూర్ లో గల ప్రధాన రహదారిపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుందని మేడ్చల్ మున్సిపల్ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది వైఫల్యం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. డ్రైనేజీ నీరు పొంగి పొర్లడంతో రోడ్లపైకి నీరు చేరి దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డైర్నేజీలు క్లీన్ చేసే జెట్ మిషన్ పాడైపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. దీని వల్ల ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News