Homeజాతీయంరాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతల స్వీకారం

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతల స్వీకారం

ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మంగ‌ళ‌వారం రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం పార్లమెంట్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ కార్యదర్శి సోమశేఖర్ జీ, నూనె బాల్‌రాజ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, అధికారులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో హౌస్ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుల వసతి, సౌకర్యాలు మరియు ఇతర పరిపాలనా అంశాలను పర్యవేక్షించే కీలక బాధ్యత హౌస్ కమిటీపై ఉంటుంది. ఈ బాధ్యతలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి పనిచేస్తానని డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.

Dr K Laxman Appointed As Rajya Sabha House Committee Chairman1
- Advertisement -
RELATED ARTICLES

Latest News