Tuesday, May 26, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNIMS | ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియా..!

NIMS | ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియా..!

  • నిమ్స్‌లో ఉన్న మెడికల్ షాపులు కేంద్రంగా సాగుతున్న దందా..
  • మెడికల్ షాప్స్ నుండి డాక్టర్లకు అడ్డదారిలో చేరుతున్న సొమ్ము..
  • రోగులను ఆసరాగా చేసుకొని కొంతమంది డాక్టర్లు చేస్తున్న స్కాం..
  • రోజూ లక్షల్లో దండుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణ..
  • అక్రమాలపై నిమ్స్ డైరెక్టర్ దృష్టి సారించాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..

వైద్యో నారాయణో హరి అన్నది నానుడి.. కానీ ప్రస్తుత కాలంలో రోగులకు ప్రాణదాతలుగా ఉండాల్సిన వైద్యులు కేవలం అక్రమ సంపాదన కోసం మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.. అసలే రోగాలతో సతమతమవుతూ ఆస్పత్రులకు వచ్చే రోగుల రక్తాన్ని కూడా ఈ డాక్టర్లు మందుల రూపంలో గుంజుతున్నారు.. మెడికల్ షాపుల యజమానులతో అంటగాగుతూ.. తప్పనిసరిగా తాము సూచించిన షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాలని శాసిస్తున్నారు..

ఈ ప్రసహనం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో జరుగుతోంది.. ఇంతటి నీచమైన వ్యవహారం నడుస్తున్నా సంబంధిత వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటే.. వారికి కూడా ఈ అవినీతి ప్రక్రియలో భాగం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. అసలు నిమ్స్ ఆసుపత్రిలో ఏమి జరుగుతోంది.. రోగులు నిలువునా ఎలా దోచుకోబడుతున్నారు..? తక్కువ ధరకే ఆసుపత్రి బయట మందులు దొరుకుతున్నా..

- Advertisement -

డాక్టర్లు ఎందుకు సెలెక్టెడ్ మెడికల్ షాపులకే రెఫర్ చేస్తున్నారు..? ఈ దారుణ వ్యవహారం వెనుకనుండి నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరు..? సంబంధిత శాఖ మంత్రి దృష్టికి ఈ దందా రావడం లేదా..? ప్రభుత్వం దృష్టికి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు..? అసలే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వైద్యం కోసం వస్తే మందుల రూపంలో మరో ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న రోగులకు ఎవరు బాసటగా నిలుస్తారు.. నిర్భయంగా, నిస్సిగ్గుగా సాగుతున్న నిమ్స్ మందుల వ్యవహారం పూర్తి ఆధారాలతో.. వెలుగులోకి తీసుకుని రానుంది

“ఆదాబ్ హైదరాబాద”..”మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News