Wednesday, December 10, 2025
EPAPER
Homeవరంగల్‌వికలాంగులు సకలాంగులతో పోటీగా శిఖరాలు అధిరోహించాలి

వికలాంగులు సకలాంగులతో పోటీగా శిఖరాలు అధిరోహించాలి

  • అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి.

వికలాంగులు సకలాంగులతో పోటీపడి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ /జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీ వేంకటేశ్వర బధిరల ఉన్నత పాఠశాల, ప్రగతి నగర్ హనుమకొండలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ / జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి, జి.డబ్ల్యూ.ఎం.సి ఆర్టికల్చర్ ఆఫీసర్ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధమని సూచించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జె.లక్ష్మి నరసమ్మ, ఉపాధ్యాయ, ఆఫీస్, హాస్టల్ సిబ్బంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News