గత నెల మే 30 తేదిన వెలువడిన ఇండియన్ ఆర్మీ ఫలితాలలో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చెందిన విద్యార్థులు 193 మంది విద్యార్థులు వివిధ విభాగాలలో ఉద్యోగాలు సాధించారు . అగ్నివీర్ జనరల్ డ్యూటీ విభాగం లో -157, అగ్నివీర్ టెక్నికల్ విభాగం లో -17, అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ విభాగం లో -14, అగ్ని వీర్ క్లర్క్-1 మంది ఉద్యోగాలు సాధించగా ఎయిర్ ఫోర్సులో- నలుగురు జే .శన్ముఖ్ సాయి రాజ్ ఎ చరణ్ తేజ్, ఎస్ శ్రిజ పి .మధుమిత విద్యార్థులు ఢిల్లీ డిఫెన్స్ అకాడమి ద్వారా ఉద్యోగాలు సాధించడం జరిగింది అని ఢిల్లీ టిఫిన్ అకాడమీ జూనియర్ కళాశాలల చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి గ తెలిపారు.
ఈ సందర్భంగా కొత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న అభ్యర్థుల ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తోంది ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. విద్యార్థులకు ప్రశ్నల సరళిపై ,కఠినతా స్థాయిలపై అవగాహన పెంపొందేలా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారి అభ్యాసన సామర్థ్యాలు పెంచుకునేలా, వారిలోని లోపాలు తెలుసుకుని సవరించుకునేలా గ్రాండ్ టెస్టులని నిర్వహిస్తూ పరీక్షల్లో విజయం సాధించేలా నిష్ణాతులుగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తీర్చిదిద్దుతోంది అని అన్నారు.
ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యం వుండాలి , దానికోసం నిరంతరం కృషి చేయాలి, చేసే పనిని తపస్సు తో భావించాలి. అప్పుడే ప్రతి ఒక్కరు విజయం సాధించగలరు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా వాటి సాధనకై నిరంతరం కృషి చేసేలా ప్రోత్సహిస్తూ వారి పరీక్షలకి అనుగుణంగా శారీరక, మానసిక అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తుండడం వలన మా అకాడమీ విద్యార్థులు రాత శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారనీ ఇంతటి విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మరియు సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోనే అత్యున్నత భోధనా ప్రమాణాలతో శిక్షణని అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో సైనిక ఉద్యోగాల ఆశావహులు, నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
