Friday, November 14, 2025
ePaper
Homeవరంగల్‌తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలి

తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలి

నర్సంపేట గురిజాల గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్వర్యంలో తుఫాన్ వల్ల నష్ట పోయిన అన్నీ పంటలను నాయకులు పరిశీలించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత – రమేష్ గారు మాట్లాడుతూ తుఫాన్ వల్ల దాదాపు అన్ని పంటలు పూర్తిగా నష్టపోయి రైతులకు చాల నష్టం జరిగింది అని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నీ రకాల పంటలకు ఎకరాకు రూ,25 వేల నష్ట పరిహారం అందించాలని కోరారు.

గతంతో తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి ఉన్నపుడు మన ప్రాంతంలో తూఫాన్ వస్తే అప్పటి ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విజ్ఞప్తి మెరకు స్వయంగా పంటల పరిశీలనకు వచ్చి నష్ట పరిహారం అందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్న పెళ్లి నరసింగం,మాజీ ఎంపీటీసీ లు గడ్డం కొమురయ్య,మాజీ సర్పంచ్ పోటు రాయపు రెడ్డి,న్యాయవాది క్లస్టర్ ఇన్చార్జి మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉప అధ్యక్షుడు అల్లి రవి,మాజీ ఉప సర్పంచ్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు బండారి చిన్న వెంకటేశ్వర్లు,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ ఎడ్ల రవీందర్,బిరన్న ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ డ్యాక రవి,మాజీ ఎస్ఎంసిఎస్ఎంసి ఛైర్మన్ కొమ్మ రవి,కురుమ సంఘం మండల కోశాధికారి అరె సుధాకర్,గోడిషాల అశోక్,పోటు తిరుపతి రెడ్డి,మాజీ గ్రామ పార్టి అధ్యక్షుడు దూడల ప్రకాశ్,ఆకుల అశోక్,దూడల ప్రవీణ్,ముచింపుల చిన్న రవి,మార్ధ అనిల్,మర్ద కుమారస్వామి,పెద్దరపు వీరాస్వామి,అల్లి ఐలయ్య,నీలం జనార్ధన్,అన్న కుమారస్వామి తదితులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News