- ఏకపక్షంగా మారిన మ్యాచ్..
ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడేలో గురువారం జరిగిన పోరులో సీఎస్‌కేనే విజయం వరించింది. క్రికెట్ అభిమానులు ‘ఎల్‌క్లాసికో’గా పిలుచుకునే ఈ పోరును చెన్నై మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో సత్తాచాటి పూర్తిగా ఏకపక్షంగా మార్చేసింది. సీఎస్‌కే నిర్దేశించిన 208 పరుగుల ఛేదనలో స్పిన్నర్లు అకీల్ హోసేన్ (4/17) నాలుగు వికెట్ల ప్రదర్శనకు తోడు నూర్ అహ్మద్ (2/23) స్పిన్ మాయాజాలానికి విలవిల్లాడిన ముంబై.. 19 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది.
దీంతో103 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ఐదో స్థానానికి ఎగబాకగా, ముంబై ఐదో ఓటమితో ఎనిమిదో స్థానంలో ఉంది. తిలక్ వర్మ (37), సూర్యకుమార్ (36) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజట్‌కే పరిమితమయ్యారు. మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై.. శాంసన్ (54 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కడంతో నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఘజన్‌ఫర్ (2/25), అశ్వని (2/37) చెరో రెండు వికెట్లు తీశారు.
