ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ (Collector) బీఎం సంతోష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ (Checking) చేశారు. సిబ్బంది విధులకు సమయానికి రావాలని, ఔట్ పేషెంట్(Out Patient), ఇన్‌పేషెంట్(In Patient)లకు వైద్య సేవల(Medical Services)ను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో వంద శాతం సాధారణ కాన్పులు (Normal Delivery) చేయాలని సూచించారు. గర్భిణిలకు బలం మాత్రలు అందించాలని, వారి పల్స్ రేట్లు (Pulse Rate) చూడాలని, స్కానింగ్(Scanning)లు చేయాలని అన్నారు.
ఎమర్జెన్సీ(Emergency) ఉన్నప్పుడు అంబులెన్స్‌ల(Ambulance)ను, బేబీ వార్మ్, స్టెరిలైజేషన్ పరికరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లో మూడు పదుల వయసు దాటినవారిని గుర్తించి బీపీ(BP), షుగర్ (Sugar) చెక్ చేసి మందులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తహశీల్దార్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేసి భూభారతి అప్లికేషన్లను త్వరతిగతిన పరిష్కరించాలని చెప్పారు.
