Saturday, May 30, 2026
Homeఅంతర్జాతీయంExpansion | చైనా ఎడారి ప్రాంతం ఉయ్ నగర్ లో భారీ నిర్మాణాలు..

Expansion | చైనా ఎడారి ప్రాంతం ఉయ్ నగర్ లో భారీ నిర్మాణాలు..

  • న్యూక్లియర్ మిస్సైళ్ళకు చెందిన ల్యాంచ్ ప్యాడ్ల తయారీ..
  • చైనా సైనిక శక్తిని చాటుతున్న శాటిలైట్ ఫోటోలు..

చైనాలోని ఎడారి ప్రాంతం ఉయ్‌గ‌ర్‌లో ఉన్న న్యూక్లియ‌ర్ ప్లాంట్ వ‌ద్ద భారీగా నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. జిన్‌జియాంగ్‌లో ఉన్న మిలిట‌రీ కాంప్లెక్స్ వ‌ద్ద .. చైనా తాజాగా ఆ నిర్మాణాలు చేప‌ట్టింది. న్యూక్లియ‌ర్ మిస్సైళ్ల‌కు చెందిన ల్యాంచ్ ప్యాడ్ల‌ను త‌యారు చేస్తోందని భావిస్తున్నారు. అమెరికాలోని ఏ న‌గ‌రాన్నైనా చేరుకునే సామ‌ర్థ్యం క‌లిగిన అణు క్షిప‌ణులు చైనా వ‌ద్ద ఉన్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా రిలీజైన శాటిలైట్ ఫోటోలు చైనా ఆయుధ శ‌క్తిని చాటుతున్నాయి.

న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను దాచిపెట్టే స్థావ‌రాల వ‌ద్ద భారీ స్థాయిలో ల్యాంచ్ ప్యాడ్లు, బంక‌ర్లు, క‌మ్యూనికేష‌న్ కేంద్రాలు నిర్మిస్తున్న‌ట్లు ఆ శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. అతి సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే క్షిప‌ణులు ఆ కేంద్రం వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఉయ్‌గ‌ర్ మిలిట‌రీ కేంద్రం వ‌ద్ద సుమారు 80 ల్యాంచ్ ప్యాడ్ల‌ను చైనా నిర్మిస్తున్న‌ది. మొబైల్ మిస్సైల్ లాంచ‌ర్లు, ఎయిర్ డిఫెన్స్ బ్యాట‌రీ ద‌ళాల సంఖ్య‌ను పెంచుకుంటోంది.

- Advertisement -

రాయిట‌ర్స్ సంస్థ రిలీజ్ చేసిన దృశ్యాల ప్ర‌కారం ఎల‌క్ట్రానిక్ వార్‌ఫేర్‌, శాటిలైట్ క‌మ్యూనికేష‌న్స్‌, క‌మాండ్ ఆప‌రేష‌న్స్ సంబంధించిన కేంద్రాల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు తెలిసింది. గ‌తంలో ఈ స్థాయిలో నిర్మాణాలు అక్క‌డ లేన‌ట్లు పేర్కొన్నారు. కానీ ఒక్క‌సారిగా చైనా భారీ ఎత్తున న్యూక్లియ‌ర్ స్థావ‌రాల వ‌ద్ద నిర్మాణాలు చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News