Homeఆదిలాబాద్Visit | జిల్లాలో పర్యటనలో ప్రమీల అగర్వాల్..

Visit | జిల్లాలో పర్యటనలో ప్రమీల అగర్వాల్..

  • స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలిగా బాధ్యతలు..

స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు ప్రమీల అగర్వాల్ శనివారం జిల్లాలో పర్యటించారు. ముందుగా మామడ మండలంలోని జగదాంబ తండాలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, పిల్లలతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. పిల్లలకు సరైన సమయంలో పోషకాహారం అందించాలని సూచించారు.

అనంతరం ఆమె, కొండాపూర్ లోని బాలసధనం (చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్) ను సందర్శించి, అక్కడ వసతి పొందుతున్న పిల్లలతో మాట్లాడారు. పిల్లలను సక్రమంగా చూసుకోవాలని, వారికి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

- Advertisement -
Child Rights Commission Pramila Agarwal District Visit

ఈ కార్యక్రమాలలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సీడబ్ల్యూసీ మెంబర్ శ్రీలత, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, బాలసదనము సూపరిండెంట్ వైష్ణవి , సూపర్వైజర్ రజిని, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News