Homeఆదాబ్ ప్రత్యేకంSwargaseema Fraud | మోసాలకు కేరాఫ్ చండ్ర చంద్రశేఖర్..

Swargaseema Fraud | మోసాలకు కేరాఫ్ చండ్ర చంద్రశేఖర్..

స్వర్గసీమ అమేయ పేరుతో జనాలకు టోకరా..

  • లంచాలు తీసుకుని పట్టించుకోని చెరుకుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్..
  • స్వర్గసీమ అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ‘ ఆదాబ్ హైదరాబాద్ ’..
  • విచారణకు ఆదేశించిన రంగారెడ్డి జిల్లా డీపీఓ..
  • అధికారుల విచారణతో బట్టబయలైన చండ్ర అక్రమ వ్యవహారం..
  • రెండు సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కార్యదర్శి..
  • పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 268 ప్రకారం కార్యదర్శిపై చర్యలు తీసుకొవాలి..
  • అమాయక ప్రజలు మోసపోకుండా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి..

రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామ పంచాయతీ శివారులో స్వర్గసీమ సుకేతన పేరుతో చండ్ర చంద్రశేఖర్ భారీ అక్రమాలకు తెరలేపారు.. అమాయక ప్రజలకు లేని అనుమతులు ఉన్నట్లు కలరింగ్ ఇస్తూ.. పూటకో వేషం వేస్తూ.. మోసాలకు పాల్పడుతున్నాడు అని ‘ఆదాబ్ హైదరాబాద’ బట్టబయలు చేసింది.. ఈ వ్యవహారంలో స్థానిక కార్యదర్శి అశోక్ నిర్లక్ష ధోరణి యిట్టే తెలిసిపోతుంది.. అవినీతి మత్తులో జోగుతున్న చెరుకుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

- Advertisement -
Chandra Chandrashekhar Swargaseema fraud0

ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన తరువాత రెండు సార్లు నోటీస్ లు ఇచ్చి చర్యలు తీసుకోకపోవడంతో పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలు తుంగలో తొక్కినట్లు స్పష్టం మవుతుంది.. అక్రమ వెంచర్లకు కేరాఫ్ గా మారిన చండ్ర చంద్రశేఖర్ స్వర్గసీమ సుకేతన, అమేయ పేరిట భారీ దందా బట్టబయలైంది..దీనితో రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరుతో అమాయక ప్రజలను నిండా ముంచుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. “స్వర్గసీమ సుకేతన అమేయ” పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న చండ్ర చంద్రశేఖర్ వ్యవహారం పై మండి పడుతున్నారు పలువురు సామాజికవేత్తలు..

Chandra Chandrashekhar Swargaseema fraud1

చెరుకుపల్లి గ్రామ పరిధిలో సాగుతున్న ఈ ప్రాజెక్ట్ పేరుతో, లేని అనుమతులు ఉన్నట్లు, నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతూ ప్లాట్లు విక్రయించి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ అక్రమాలకు ఆజ్యం పోయడంలో పరోక్ష సహకారం అందించిన పంచాయతీ కార్యదర్శి అశోక్ పాత్ర ఉన్నట్లు సైతం పలు అనుమానాలకు తావిస్తోంది.. అక్రమ వెంచర్ అని తెలిసినా నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి..

Chandra Chandrashekhar Swargaseema fraud

ఈ ఘటనపై స్పందించిన రంగారెడ్డి జిల్లా డీపీఓ విచారణకు ఆదేశాలు జారీ చేశారు..అనుమతులు లేకుండా చేస్తున్న ఈ లేఅవుట్ అభివృద్ధి, రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమి గా ఉండి నాలా కన్వర్షన్ కాకుండా ఉండటంపై అధికారుల మౌనం దేనికి సంకేతం అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 268 ప్రకారం సంబంధిత కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ లేఅవుట్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, చండ్ర చంద్రశేఖర్ చేస్తున్న మోసాల వలలో పడి అమాయకులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి..

జిల్లా పంచాయతీ అధికారి స్పందించి పంచాయతీ కార్యదర్శి అశోక్ ని తక్షణమే విధుల నుండి తొలగించి, అక్రమ వెంచర్ ను కట్టడి చేసి, చండ్ర చంద్ర శేఖర్ అక్రమాలకు కళ్లెం వేయాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. స్వర్గసీమ, సిరుల సీమ సుకేతన, అమేయ పేరుతో చేస్తున్న అక్రమాలకు సంబంధించి మరో కథనం ద్వారా వాస్తవాలు ఆధారాలతో వెలుగులోకి తేనుంది

“ఆదాబ్ హైదరాబాద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News