Tuesday, May 5, 2026
Homeభక్తిSpiritual | ఈ శివాలయాన్ని దర్శిస్తే చాలు..

Spiritual | ఈ శివాలయాన్ని దర్శిస్తే చాలు..

  • మీ రోగాలన్నీ మటుమాయం అవుతాయి..
  • సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం..

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే వ్యాధులు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పోలిన శివలింగం తెలంగాణలోని చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుంది. పూర్తిగా మరకతంతో తయారైన ఈ సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇంతకూ ఈ పవిత్ర క్షేత్రం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం.

పరమేశ్వరుడు తన భక్తులను అనుగ్రహించేందుకు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిసినట్లుగా పురాణాలు చెబుతాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లిలో వైద్య నాథేశ్వరుడిగా కొలువుదీరిన శివుడు భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడనే విశ్వాసం ఉంది. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రంతో మెరిసే మరకత శివలింగం తెలంగాణలో చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

- Advertisement -

సాధారణంగా శివలింగం పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం వంటి అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వాటిలో మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలంలో క్రీ.శ. 1076–1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. క్రీ.శ. 1101 కార్తిక శుద్ధ పంచమి గురువారం ఈ క్షేత్రంలో మరకత శివలింగ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించినట్లు ఆలయంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News