Homeక్రైమ్ వార్తలుExplosion | చల్లపల్లి పీఎస్ పరిథిలో ప్రమాదం..

Explosion | చల్లపల్లి పీఎస్ పరిథిలో ప్రమాదం..

  • మందుగుండు సామాగ్రి పరిశీలిస్తుండగా పేలుడు..

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పెను ప్రమాదం సంభవించింది. బయటనుంచి తీసుకొచ్చిన మందుగుండు సామగ్రిని పోలీస్ స్టేషన్‌లో పరిశీలిస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఎస్సై‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, పోలీసు వాహన డ్రైవర్ ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్‌లోని ఫర్నీచర్‌తో పాటు బయట పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ పేలుడు గురించి తెలియగానే సీఐ కేఎస్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News