Homeఅంతర్జాతీయంAmerican Airlines | తప్పిన పెను ముప్పు..

American Airlines | తప్పిన పెను ముప్పు..

  • వాషింగ్టన్ డీసీ సమీపంలో రెండు విమానాలు ఢీ ..American Airlines
  • రొనాల్ట్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో సంఘటన

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఉన్న రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న క్రమంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల రెక్కలు ఒకదానికొకటి రాసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, డల్లాస్ వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 638, చికాగో వెళ్లాల్సిన ఫ్లైట్ 2152 రన్‌వే 19 వద్ద టేకాఫ్ కోసం వరుసలో ఉన్నాయి. ఈ క్రమంలో ట్యాక్సీయింగ్ చేస్తుండగా రెండు విమానాల రెక్కల చివరలు ఒకదానికొకటి తగిలాయి. ఈ ప్రమాద ప్రభావంతో ఒక విమానం రెక్కకు చెందిన వింగ్‌లెట్ భాగం విరిగి ట్యాక్సీవేపై పడిపోయింది.American Airlines

ఈ విషయాన్ని పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు విమానాలను తిరిగి గేట్ల వద్దకు తరలించారు. మెట్రోపాలిటన్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఆ విమానాలను తనిఖీ చేశారు. అనంతరం, రెండు విమానాలను మరమ్మతుల కోసం సర్వీసు నుంచి తొలగించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరిన సంస్థ, వారిని ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. థ్యాంక్స్ గివింగ్ పండుగ రద్దీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News