Homeమహబూబ్‌నగర్‌Gopalpeta | సర్పంచ్ పీఠం.. బీఆర్ఎస్ కైవసం..

Gopalpeta | సర్పంచ్ పీఠం.. బీఆర్ఎస్ కైవసం..

14 వార్డుల్లో 9 వార్డులు కారు పార్టీకే

2186 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భారీ విజయం

- Advertisement -

వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 11(ఆదాబ్ హైదరాబాద్): వనపర్తి జిల్లా (Wanaparthy District) గోపాల్‌పేట కేంద్రంలో సర్పంచ్ (Sarpanch) పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం (BRS Party Win) చేసుకుంది. గురువారం జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల భాస్కర్ స్వప్న(Karrolla Bhaskar Swapna).. తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థిపై 2186 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించటంతో గోపాల్‌పేట ప్రజలు, కార్యకర్తలు సంబరాల్లో (Celebrations) మునిగితేలారు. అధికారం కోసం కాకుండా ప్రజల సేవే (Public Service) పరమావధిగా భావించిన కర్రోళ్ల స్వప్న భాస్కర్‌కు ఈ విజయం దక్కడం వారి కృషికి నిదర్శనమని పలువురు గ్రామ ప్రజలు, మేధావులు చర్చించుకుంటున్నారు.

brs party2
- Advertisement -
RELATED ARTICLES

Latest News