బ్రెజిల్ అధ్యక్షుడు (Brazil President) లూలా డిసిల్వా (Lula da Silva) 2026లో ఇండియాలో పర్యటిస్తారు. ఆ దేశ ఉపాధ్యక్షుడు గెరాల్డో అల్క్‌మిన్ ఈమధ్యే మన దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో గెరాల్డో అల్క్‌మిన్ పర్యటనపై లూలా డిసిల్వా సామాజిక మాధ్యమం(Social Media)లో స్పందించారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం రాజకీయ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో పురోగతికి సహాయపడుతుందని అన్నారు. ఇరు దేశాలు కలిసి నడిస్తే టెక్నాలజీ, పారిశ్రామిక, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధ్యమని లూలా డిసిల్వా ఆశాభావం వ్యక్తం చేశారు. లూలా డిసిల్వా భారత్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2025 ఆగస్ట్‌లో ఇండియా, బ్రెజిల్ ఉత్పత్తులపై అమెరికా (America) 50 శాతం చొప్పున సుంకాలు విధించింది.
Brazil | 2026లో భారత పర్యటనకు బ్రెజిల్ అధ్యక్షుడు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
