- అపర్ణ పెద్దమ్మ,ఈదమ్మ మాందాత, బీరప్ప కామరాతి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
- పాల్గొన్న మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ( Bonalu festival ) బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు.అమ్మవారి ఆశీస్సులతో కడ్తాల్ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల పరమేష్,అన్మాస్ పల్లి ఉపసర్పంచ్ మహేష్ యాదవ్,వార్డు సభ్యులు మాదారం గణేష్ గౌడ్,ఎర్రోళ్ల రాఘవేందర్, దేవలా నాయక్, యాట నర్సింహా, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, బీచ్యా నాయక్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.అలాగే వివిధ కుల సంఘాల పెద్దలు మూడ బాలయ్య,కేశని యాదయ్య, బొల్లా సత్యనారాయణ, చెన్నమోని శేఖర్, కటికపల్లి రమేష్, రేపని యాదయ్య, వరకుప్పల వెంకటేష్, బోసు వెంకటేష్, సత్యం, నరసింహ, పాండు, రాజు, శ్రీశైలం , మహేష్, కురుమ సంఘం పెద్దలు యాదయ్య, కృష్ణయ్య,చేగూరి రాములు, సూద శ్రీను, బండ శ్రీను, జల్కం నాగార్జున, జల్కం రమేష్, పిప్పల్ల యాదయ్యతో పాటు స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
