Homeరంగారెడ్డిBanjara Seva Dal| బంజారా సేవాదళ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా హన్మా నాయక్

Banjara Seva Dal| బంజారా సేవాదళ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా హన్మా నాయక్

  • నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు రామావత్ రఘురాం రాథోడ్.Banjara Seva Dal

బంజారా సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామానికి చెందిన వాంకుడోవత్ (Banjara Seva Dal) హన్మా నాయక్ నియమితులయ్యారు.బంజారా సేవాదళ్‌ (రిజిస్టర్‌ నం. 744/2026)ను బలోపేతం చేయడంతో పాటు బంజారా సమాజ సంక్షేమం,హక్కుల కోసం కృషి చేస్తున్న హన్మా నాయక్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు.హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బంజారా సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామావత్‌ రఘురాం రాథోడ్ హన్మా నాయక్‌కు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.

Hanma Naik Banjara Seva 1

ఈ సందర్భంగా రామావత్‌ రఘురాం రాథోడ్‌ మాట్లాడుతూ హన్మా నాయక్‌ నియామకంతో బంజారా సేవాదళ్‌ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సమాజంలో వెనుకబడిన బంజారా ప్రజల హక్కులు,సంక్షేమం కోసం హన్మా నాయక్‌ చిత్తశుద్ధితో పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హన్మా నాయక్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామావత్‌ రఘురాం రాథోడ్‌,సంఘం నాయకులు,సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.బంజారా సమాజ ప్రగతికి,సంఘం ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బంజారా సేవాదళ్‌ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News