Thursday, January 22, 2026
EPAPER
Homeఖమ్మంDeputy CM | మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన వద్దు

Deputy CM | మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన వద్దు

గత ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి రూ.40,154 కోట్ల బిల్లులను పెండింగ్‌(Pending Bills)లో ఉంచిన విషయాన్ని శ్వేతపత్రం(Whitepaper) ద్వారా శాసనసభ(Assembly)లో ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) అసెంబ్లీలో శుక్రవారం అన్నారు. ఇందులో ఉద్యోగుల బిల్లులు రూ.4,575 కోట్లు అని చెప్పారు. పెన్షనరీ బెనిఫిట్స్‌(Pensionary Benefits)లో భాగంగా ఇప్పటివరకు రూ.1,752 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఇంకా చెల్లించాల్సిన మొత్తం రూ.6,244 కోట్లు అని పేర్కొన్నారు.

‘మిగిలిన పెన్షనరీ బెనిఫిట్స్ కోసం ప్రతి నెలా రూ.700 కోట్లను క్రమంతప్పకుండా విడుదల చేస్తున్నాం. అదేవిధంగా.. ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలను క్రమంతప్పకుండా చెల్లిస్తున్నాం. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ (Free Power) ద్వారా SPDCL, NPDCL కింద ప్రతి నెలా 52 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య భీమాను అమలుచేస్తున్నాం. అలాగే.. ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ స్కీమ్‌ను త్వరలో అమల్లోకి తీసుకువస్తాం. మెడికల్ బిల్లుల కోసం రూ.200 కోట్ల చెల్లింపులు పూర్తిచేశాం. ఇకపై ఎవరికీ మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగుల జీతాలు, మెడికల్ బిల్లులు(Medical Bills) ఎప్పుడూ పెండింగ్‌లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మల్లు భట్టివిక్రమార్క వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News