Tuesday, April 28, 2026
Homeహైదరాబాద్‌Tribute | బౌద్ధనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Tribute | బౌద్ధనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

  • సామాజిక సమానత్వానికి బాటలు వేసిన నేత జగ్జీవన్ రామ్ -మేకల సారంగపాణి
  • సికింద్రాబాద్ లో బీజేపీ నేతల నివాళి

సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం నాడు బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలను పురస్కరించుకొని బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని పార్షిగుట్ట చౌరస్తాలో బీజేపీ కంటెస్టెడ్ కార్పోరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ ఇంచార్జ్ మేకల సారంగపాణి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై జగ్జీవన్ రాం కి పూలమానులు వేసి నివాళి ఘటించారు.

ఈ సందర్భంగా మేకల సారంగ పాణి మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం,పేదల అభ్యున్నతి కోసం,అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, దూరదృష్టి గల నాయకుడిగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఆయన ఆలోచనలు,సేవా స్పూర్తి నేటి తరానికి మార్గదర్శకమని,ఆయన ఆశయాల సాధనకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమంతు ముదిరాజ్,కొమ్రయ్య,సాయ దత్తు,గుండ్రపల్లి శ్రీనివాస్,సత్యనారాయణ,శ్యామ్ ముదిరాజ్,సతీష్ నేత,బైరి సురేష్ అమరవతి,బాలయ్య,వనమాల శ్రీనివాస్,క్రాంతి,బీజేవైఎం నాయకులు సాయి ముదిరాజ్,విజయ్ లాల్,మహిళా నాయకురాళ్లు నాగరాణి,సరిత గౌడ్,యాదమ్మ,ప్రమీల,వాణి,మమత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News