- వైట్ షుగర్, రిఫైండ్ ఉప్పు, పాలిష్ బియ్యం దూరం పెట్టండి..
రోజూ వంటగదిలో ఉపయోగించే కొన్ని తెల్లని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి నెమ్మదిగా హానికరంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో ఎక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాలు వాడడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి వంటగది నుండి తప్పనిసరిగా ఈ వైట్ ఫుడ్స్ ను తొలగించాలని సూచించారు. మనం తీసుకునే ఆహారం నుండి తొలగించాల్సిన 5 వైట్ ఫుడ్స్ గురించి.. అలాగే వాటికి బదులుగా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు చూద్దాం..
వైట్ షుగర్‌కు గుడ్‌బై చెప్పాలి. తెల్ల చక్కెర దాదాపు ప్రతి ఇంట్లో ఉండే సాధారణ పదార్థం. అయితే ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచి, అలవాటు అయ్యేలా చేస్తుంది. రిఫైన్డ్ ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. సాధారణ టేబుల్ సాల్ట్‌లో సహజ ఖనిజాలు తొలగించబడతాయి. అలాగే ఇందులో కొన్ని రసాయనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది.
తెల్ల ఉప్పుకు దీనికి బదులుగా రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, సహజంగా ఎండబెట్టిన సముద్ర ఉప్పు వంటి వాటిని వాడడం మంచిది. పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్ని ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు. తెల్ల బియ్యాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. దీనికి బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్ వంటి ధాన్యాలను తీసుకుంటే ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.
