Saturday, May 9, 2026
Homeక్రైమ్ వార్తలుYavan Case | యావన్ మర్డ*ర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్..

Yavan Case | యావన్ మర్డ*ర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్..

  • ఇదంతా మా బావ ప్లాన్ అని చెప్పిన యువతీ..

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ మర్డ*ర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్ బయటపడింది. యావన్ హత్యకు ముందు అతనికి ఫోన్ చేసిన యువతి.. తమ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర గురించి తెలిపింది. ‘నువ్వు నన్ను వేధిస్తున్నావని పోలీసుల ముందు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు.. నీ మీదకు అంతా రావాలని చూస్తున్నారు.’ అని ఆ కాల్‌లో పేర్కొంది. ఇదంతా తన బావ ప్లాన్ అని.. చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడని చెప్పింది. నన్ను రేపు కాలేజీకి వెళ్లవద్దని అంటున్నారు. ఎందుకు అని అడిగితే రేపు పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని అంటున్నారని యువతి ఫోన్‌ కాల్‌లో చెప్పింది.

స్టేషన్‌కు వచ్చి వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్పి, తర్వాత కంప్లయింట్‌లో ఏం రాయించాలో, మేం అది రాయిస్తామని మా డాడీ అంటున్నారని తెలిపింది. ఈ కేసు అంతా నీ మీదకు రావాలని చూస్తున్నారని చెప్పింది. ఇదంతా మా బావ ప్లాన్ అని తెలిపింది. నేను యాడికి అయితే ఆడికి.. నేను అయితే సంతకం పెట్టేందుకు రెడీగా లేనని చెప్పాను. నేను సంతకం పెట్టను అంటే.. నువ్వు కూడా లవ్ చేస్తున్నావా అని అడుగుతారు.. అందుకే నువ్వు ఏం అనుకుంటున్నావో తెలుసుకుందామని నీకు కాల్ చేశా అని అందులో తెలిపింది. మధ్యలో నేను పిచ్చిదాన్ని.. ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -

పోలీస్ స్టేషన్‌‌కు వచ్చి వాడు టార్చర్ చేస్తుండు అని చెప్పు. అంతకుమించి ఒక్క మాట మాట్లాడొద్దు.. అక్కడ గాయిగాయి చేయొద్దు.’ అని బెదిరిస్తున్నారని తెలిపారు. మరి ఏం చేయాలని అనుకుంటున్నారని యావన్ అడగ్గా.. మీరు వదిలినా వాళ్లను నేను వదలను అని మా బావ అంటున్నాడని సమాధానమిచ్చింది. మీరెమన్నా చేసుకోండి.. నేను ఇద్దర్నీ వదల.. ఇద్దర్నీ చంపేస్తా అని మా బావ అన్నాడని తెలిపింది. అన్నట్లుగానే ఇప్పుడు యావన్ మర్డ*ర్ జరగడంతో ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News