Saturday, May 9, 2026
Homeఆరోగ్యంSleep | మనిషికి నిద్ర ఎంతో అవసరం..

Sleep | మనిషికి నిద్ర ఎంతో అవసరం..

  • సకీయ బ్యాంకింగ్ దీనికి పరిష్కారం..
  • కొద్ది రోజులు అధిక నిద్ర పోవడం ఒక పద్ధతి..

నేటి త‌రుణంలో సరిపడా నిద్ర పొందడం చాలామందికి పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, పరీక్షలు, రాత్రి షిఫ్టులు, ప్రయాణాలు వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతోంది. అయితే నిద్ర తగ్గే పరిస్థితులు ముందుగానే తెలిసినప్పుడు, దానికి శరీరాన్ని సిద్ధం చేసుకునే ఒక కొత్త పద్ధతి ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. దీనినే స్లీప్ బ్యాంకింగ్ అని పిలుస్తున్నారు. స్లీప్ బ్యాంకింగ్ అంటే ముందుగా కొన్ని రోజుల పాటు అదనంగా నిద్రపోవడం ద్వారా, తర్వాత వచ్చే నిద్రలేమి ప్రభావాన్ని తగ్గించుకోవడం. సాధారణంగా నిద్ర తగ్గిన తర్వాత దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం.

కానీ ఈ పద్ధతిలో మాత్రం ముందుగానే ఎక్కువ నిద్ర తీసుకుని శరీరానికి ఒక రకమైన రిజర్వ్‌ సిద్ధం చేస్తారు. దీంతో నిద్ర తక్కువగా ఉన్న రోజుల్లో కూడా మెదడు చురుకుదనం, ఏకాగ్రత కొంతవరకు నిలబడుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్‌ను 2009లో పరిశోధకులు పరిచయం చేశారు. ఒక అధ్యయనంలో కొంతమంది వ్యక్తులు కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ ఎక్కువసేపు నిద్రపోయారు. తర్వాత వారందరికీ కొన్ని రోజుల పాటు చాలా తక్కువ నిద్ర మాత్రమే ఇచ్చారు. ముందుగా ఎక్కువ నిద్రపోయినవారిలో అలసట తక్కువగా ఉండటంతో పాటు, ఏకాగ్రత కూడా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

- Advertisement -

అంతేకాదు, వారు మామూలు స్థితికి కూడా త్వరగా చేరుకున్నారని పరిశోధకులు వెల్లడించారు. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి వంటి అనేక అంశాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. సరిపడా నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గిపోవడం, స్పందన సమయం మందగించడం, చిరాకు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే అదనపు నిద్ర తీసుకోవడం శరీరానికి కొంత రక్షణగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News