ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Recruitment Rally) ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండ(Hanumakonda)లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అర్హులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనొచ్చు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని అగ్నివీరులు(Agniveer)గా ఎంపిక చేస్తారు. జనరల్ డ్యూటీ(General Duty), టెక్నికల్(Technical), క్లర్క్(Clerk), స్టోర్ కీపర్ (Stor Keeper) టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్(Tradesman) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మార్చి 12న www.joinindianarmy.nic.inలో పొందుపరిచిన ర్యాలీ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు పొందాలి. అందులో పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లు తీసుకొని రావాలి. సందేహాలు ఉన్నవారు 040 27740059, 040 27740205 నంబర్లకు కాల్ చేసి మాట్లాడొచ్చు.
Army | ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ వివరాలు
RELATED ARTICLES
- Advertisment -

