Homeనల్లగొండObservation | ఆంజనేయ స్వామి, సోమసూత్ర శివలింగం పరిశీలన

Observation | ఆంజనేయ స్వామి, సోమసూత్ర శివలింగం పరిశీలన

‘ఆదాబ్’ కథనానికి రెండు శాఖల అధికారుల స్పందన

సూర్యాపేట ప్రతినిధి, నవంబర్ 13 (ఆదాబ్ హైదరాబాద్): తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో ఈ నెల 11న బయటపడ్డ ఆంజనేయ స్వామి విగ్రహం(Anjaneya Swamy Statue), కాకతీయుల సోమసూత్ర శివలింగం(Kakatiya Soma Sutra Shiva Lingam)పై 12న ‘ఆదాబ్’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పరిశీలన కోసం పురావస్తు శాఖ ఏడీ, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం గురువారం అనంతారం గ్రామానికి చేరుకొని పరిశీలన జరిపారు. శిల్పాల వైశిష్ట్యం, పురాతనత, చెక్కు చెదిరిన సూచనలు, భద్రతా అవసరాలపై వివరాలు నమోదు (Details Noted) చేశారు.

- Advertisement -
WhatsApp Image 2025 11 13 at 20.30.09

‘ఆదాబ్’ వల్లే తమకు వీటి గురించి తెలిసిందని చెప్పారు. ఈ శిల్పాలు ప్రాంతీయ చరిత్ర(Region History)కు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. వీటి పరిరక్షణ(Preservation), అభివృద్ధి (Development) కోసం అవసరమైన సూచనలు, సలహాలతో పూర్తి నివేదికను (Report) సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విగ్రహాల సంరక్షణ చర్యలు చేపట్టి, వీటిని కాపాడే విషయంపై గ్రామస్థులకూ అవగాహన కల్పిస్తామని అన్నారు. దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, శరత్ చంద్రతోపాటు పురావస్తు శాఖ సిబ్బంది గట్టు వీరయ్య, సోమారపు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News