Homeకరీంనగర్Anganwadi | అంగన్‌వాడీల సేవలు అమూల్యం

Anganwadi | అంగన్‌వాడీల సేవలు అమూల్యం

బీజేపీ అధికారంలోకి వస్తే వారికి వేతనాలు పెంచుతాం
ఎంపీ లాడ్స్‌తో పిల్లలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయండి
కరీంనగర్ ‘పోషణ మాసం’ ముగింపు ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
తెలంగాణలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల అమల్లో కరీంనగర్ సిబ్బంది పనితీరు బాగుందని అభినందనలు

కొవిడ్ (Covid) మహమ్మారి సమయంలోనూ, అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు అంగన్‌వాడీలు(Anganwadis) అందించిన సేవలు మరువలేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sajay Kumar) అన్నారు. వారి సేవలను గుర్తించడంతోపాటు వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ (Bjp) అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అంగన్ వాడీలకు వేతనాలను పెంచుతామని చెప్పారు. ఈరోజు

- Advertisement -
WhatsApp Image 2025 10 27 at 19.04.20

దేశంలో ఒకప్పుడు చిన్నపిల్లలు పోషకాహార లోపం(Malnutrition)తో ఇబ్బందులు పడ్డారని, అనేక వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు శ్రీకారం చుట్టడమే కాకుండా విజయవంతంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) హెల్త్ కార్డు పేరుతో ఉచితంగా రూ.5 లక్షల వైద్యం అందిస్తోందన్నారు. బస్తీ దవాఖానాలతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సూదులు, దూది సహా అన్ని వస్తువులు కేంద్ర నిధుల ద్వారా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆసుపత్రులకు భవనాల నిర్మాణానికి సైతం కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు.

WhatsApp Image 2025 10 27 at 19.04.19

కరీంనగర్ లోని కళాభవన్ లో ఈరోజు మహళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించిన ‘పోషణ మాసం’ (Poshana Masam) ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం, పోషణపట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు ఏర్పాటు చేసి స్టాళ్లను కేంద్ర మంత్రి సందర్శించారు. చిన్నారులకు పోషణ, ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు చేతి గ్లౌజ్ తరహాలో తయారు చేసిన ఉత్పత్తులు కేంద్ర మంత్రిని ఆకర్షించాయి. వీటిని ప్రతి ఒక్క పిల్లవాడికి అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎంపీ నిధుల నుండి వాటిని కొనుగోలు చేయించేందుకు సిద్ధమని చెప్పారు. అట్లాగే గతంలో ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.12 లక్షలు కూడా కేటాయించిన విషయాన్ని గుర్తు చ శారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

WhatsApp Image 2025 10 27 at 19.04.19 1

దేశంలో ఒకప్పుడు పోషకాహార లోపంతో మహిళలు, చిన్నారులు అనేక ఇబ్బందులు పడ్డారు. పోషకాహారల లోపంవల్ల జన్మించిన పిల్లలు అనేక వ్యాధులతో నిరంతరం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇది గమనించిన ప్రధాని నరేంద్రమోదీ 2018, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మిషన్ సాక్ష్యం అంగన్ వాడీ, పోషణ్ 2.0 అభియాన్(Mission Saksham Anganwadi and POSHAN 2.0) కార్యక్రమాన్నిప్రారంభించారు. పోషకాహార లోపం, ఎదుగుదల లోపించిన, బరువు తక్కువున్న, రక్తహీనత వంటి సమస్యలను నిర్మూలించడానికి ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల అమలు కోసం (Mission Saksham Anganwadi & POSHAN 2.0 కు) కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో 21 వేల 960 కోట్ల రూపాయలను కేటాయించారు. విజయవంతంగా ఈ స్కీం అమలవుతోంది. పోషణ ట్రాకర్ యాప్ ద్వారా సుమారు 1 కోటి 50 లక్షల మంది లబ్ధిదారులు ఈ స్కీంతో లబ్ది పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పోషణ మాసం కార్యక్రమాలు ద్వారా కోట్ల మందికి అవగాహన పెరిగింది. డిజిటల్ మానిటరింగ్ వల్ల ఆంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) ప్రకారం ఈ కార్యక్రమం అమలైన తరువాత పిల్లల్లో ఎదుగదల లోపాలు చాలా మేరకు తగ్గాయి. రక్తహీనత వ్యాధి రేట్ కూడా చాలా తగ్గింది.

WhatsApp Image 2025 10 27 at 19.04.18 1

తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కరీంనగర్ ముందంజలో ఉండటం సంతోషం. ఈ విషయంలో అంగన్ వాడీల సేవలను, అధికారుల సమన్వయంతో పనిచేస్తున్న తీరు అభినందనీయం. చిన్నారులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన ఉత్పత్తులు కొనేందుకు ఎంపీ లాడ్స్ నుండి నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. గతంలోనూ రూ.12 లక్షలు ఇచ్చిన సంగతి మరువొద్దు. ప్రజల ఆరోగ్యం, విద్య, ఉన్నతి విషయంలో అధికారులు ఏది కోరినా తన శక్తి మేరకు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంగన్ వాడీల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వారి వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అంగన్ వాడీల వేతనాలను పెంచేలా చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News