Homeఆదాబ్ ప్రత్యేకంExposed | ఆదాబ్ ఆధారం దాసోజు స్వరం.. దిగొచ్చిన సర్కార్

Exposed | ఆదాబ్ ఆధారం దాసోజు స్వరం.. దిగొచ్చిన సర్కార్

  • ఉస్మానియా యూనివర్సిటీలో లా కోర్సు పరీక్షల గందరగోళం
  • సాక్షాదారాలతో సహా కథనం ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్
  • ఆదాబ్ కథనం ఆధారంగా ప్రభుత్వాన్ని కడిగేసిన దాసోజు శ్రవణ్
  • 3 సం. లా కోర్సు పేపర్ 6 పరీక్షను తిరిగి నిర్వహించాలని నిర్ణయం
  • ఈ నెల 7వ తేదీన పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
  • వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ పై సర్వత్రా ప్రశంసలు
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజుకు లా విద్యార్థుల కతజ్ఞతలు

మా అక్షరం అవినీతిపై అస్త్రం అనే నినాదంతో అక్షర యుద్ధం చేస్తున్న ఆదాబ్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది.. రాష్ట్ర విద్యావ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలను ఆధారాలతో వెలుగులోకి తీసుకుని వచ్చి సంచలనానికి తెరలేపింది.. ఎంతోమంది న్యాయశాస్త్ర విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడింది..

Osmania University Law Exam Controversy Leads To Re

ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన లా కోర్సుల పరీక్షల గందరగోళంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే.. విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విపక్ష నేతలు మండిపడ్డారు. ఫిబ్రవరి 25న ఐదేళ్ల లా కోర్సు విద్యార్థులకు “ హిస్టరీ ఆఫ్ కోర్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇండియా “ అనే సబ్జెక్టు పరీక్ష జరిగింది.

- Advertisement -

ఆశ్చర్యకరంగా, ఫిబ్రవరి 27న జరిగిన మూడేళ్ల హానర్స్ లా కోర్సు విద్యార్థుల “లీగల్ అండ్ కాన్ స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా “ పరీక్షకు కూడా దాదాపు అదే ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేశారు. రెండు వేర్వేరు కోర్సులకు, రెండు వేర్వేరు తేదీల్లో ఒకే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం విద్యావర్గాల్లో కలకలం రేపింది. “ఒక ప్రశ్నపత్రాన్ని కూడా సక్రమంగా సిద్ధం చేయలేని ప్రభుత్వం రాష్టాన్ని ఎలా సమర్థంగా నడిపిస్తుంది?” అని దాసోజు శ్రవణ్ ఘాటుగా ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే..

ఈ ఘటన విద్యాశాఖలో ఉన్న సమన్వయ లోపానికి, నిర్లక్షానికి అద్దం పడుతోందని అయన విమర్శించారు. ఇంత దారుణ సంఘటన జరిగితే ప్రధాన ప్రింట్ మీడియా గానీ, ప్రముఖ టీవీ చానల్స్ గానీ ఈ విషయాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడానికి ముందుకు రాకపోవడం విచారకరం..

Osmania University Law Exam Controversy Leads To Re Exam00 1

కానీ బాధ్యతతో వ్యవహరించిన ఆదాబ్ హైదరాబాద్, లా విద్యార్థుల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశ్యంతో నిర్భయంగా జరిగిన వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకుని రావడం ముదావహం అని శ్రావణ్ కొనియాడారు.. అలాగే భవిష్యత్తులో న్యాయాన్ని నిలబెట్టే అత్యున్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులపట్ల ప్రభుత్వ నిర్లక్షవైఖరి క్షమించరానిదని ఆయన ఘాటుగా విమర్శించారు..

కాగా దాసోజు శ్రవణ్ మీడియా ముందు సంధించిన ప్రశ్నలకు రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.. దీంతో చేసేది ఏమీ లేక.. దిగిరాక తప్పలేదు.. వెంటనే జరిగిన తప్పు సరిదిద్దుకునేందుకు అడుగులు వేసింది.. ఫిబ్రవరి 27న జరిగిన మూడేళ్ళ హానర్స్ లా కోర్సు విద్యారుదు రాసిన పరీక్షలను రద్దు చేసింది..

Osmania University Law Exam Controversy Leads To Re

ఈనెల 7 వ తేదీన తిరిగి కొత్త ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించి దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. దీనిపై ఆందోళనలో ఉన్న విద్యార్థులకు రిలీఫ్ లభించినట్లయింది.. ఈ సందర్భంగా ప్రభుత్వంతో బాటు, తన గళాన్ని వినిపించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ కి, అదే విధంగా నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక యాజమాన్యానికి వారు కతజ్ఞతలు తెలిపారు.. మరో సారి ఇలాంటి పొరబాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు..

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఖండించిన దాసోజు శ్రవణ్.. కేవలం ఒక్క క్వశ్చన్ పేపర్ సరిగా తయారు చేయలేని ప్రభుత్వం ఇక పరిపాలన ఏమి చేస్తుందని ఎద్దేవా చేస్తూ.. ఇలాంటి వాస్తవాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్న ఆదాబ్ ని ప్రత్యేకంగా అభినందించారు.. ముందు ముందు ఆదాబ్ మరిన్ని యదార్ధాలను ప్రచురిస్తూ సమాజానికి చుక్కానిలా వుండాలని ఆకాంక్షించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News