Wednesday, April 15, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంస్వామివారిని దర్శించుకున్న ఆదాబ్ హైదరాబాద్ పత్రిక చైర్మన్

స్వామివారిని దర్శించుకున్న ఆదాబ్ హైదరాబాద్ పత్రిక చైర్మన్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక చైర్మన్ సత్యం వీరమళ్ళ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ప్రధానాలయంలోని స్వయంభు మూర్తులను దర్శించుకుని ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అలాగే సువర్ణ పుష్పార్చనలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి వచ్చానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తన కుటుంబం పైన, ఆదాబ్ హైదరాబాద్ పత్రికా కుటుంబం పైన ఉండాలని కోరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News