- మోడీ ఆహ్వానం మేరకు పయనం..NDA Delhi Meeting
- కీలక బిల్లులపై విస్తృతంగా జరుగనున్న చర్చ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం మేరకు వీరిద్దరూ ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సాయంత్రం జరగనున్న ఈ కీలక భేటీలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న పలు కీలక బిల్లులపై విస్తృతంగా చర్చించనున్నారు.NDA Delhi Meeting
నవంబర్ 30 నుంచి లోక్సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులను తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2026 ఏప్రిల్ లో రాజ్యాంగ సవరణ కోసం చేపట్టిన ప్రయత్నాల్లో తగినంత మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. దీంతో ఈసారి ఎలాగైనా వీటిని ఆమోదింపజేయాలనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.
ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, ప్రాతినిధ్యం తగ్గే అవకాశాలపై వస్తున్న విమర్శలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఎన్డీయే మిత్రపక్షాల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడంపై ప్రధాని మోదీ సమాలోచనలు జరపనున్నారు. అలాగే పార్లమెంట్లో విపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కూటమి నేతలతో చర్చించి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
