Homeరంగారెడ్డిSamvidhan Raksha March | రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ శంఖారావం

Samvidhan Raksha March | రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ శంఖారావం

  • వంబర్ 26న హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’..Samvidhan Raksha March
  • శంకర్‌పల్లి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి
  • కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు బొల్లారం వెంకట్‌రెడ్డి,మడపతి చంద్రమౌళి పిలుపు

భారత రాజ్యాంగ పరిరక్షణ,ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శంకర్‌పల్లి మండల,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నవంబర్ 26న గురువారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.Samvidhan Raksha March

ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మున్సిపల్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,కౌన్సిలర్లు,పార్టీ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు,మాజీ ఉపసర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు,స్వేచ్ఛ,సమానత్వం,సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ మార్చ్‌లో కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా పాల్గొని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ బలాన్ని, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు శంకర్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్‌రెడ్డి,శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News