Homeనల్లగొండRaghunathapalem Fund Diversion | రఘునాథపాలెం పంచాయతీలో రూ.35 లక్షల నిధుల మళ్లింపు ఆరోపణలు...

Raghunathapalem Fund Diversion | రఘునాథపాలెం పంచాయతీలో రూ.35 లక్షల నిధుల మళ్లింపు ఆరోపణలు…

  • జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు…Raghunathapalem Fund Diversion
  • వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీపై విచారణకు గ్రామస్తుల డిమాండ్…

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై తీవ్ర వివాదం నెలకొంది. సుమారు రూ.35 లక్షల అభివృద్ధి నిధులను వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు మళ్లించారంటూ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త యం.వెంకటేష్ జిల్లా కలెక్టర్‌ తేజస్ నంద లాల్ పవర్ కు ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సర్పంచ్ కమని కుమారి భర్త నర్సింహారావు, పంచాయతీ కార్యదర్శి ధరావత్ లక్ష్మణ్ నాయక్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీపై ఆరోపణలుRaghunathapalem Fund Diversion

- Advertisement -

కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతా నుంచి పలు విడతల్లో వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీ జరిగినట్లు ఆరోపించారు. సర్పంచ్ భర్త నర్సింహారావు ఖాతాకు 2026 మార్చి 13న మూడు విడతల్లో రూ.4,90,003, మార్చి 20న రూ.1,91,212, మార్చి 25న రూ.5,53,000తో పాటు మరో రూ.లక్ష, మార్చి 31న ఇంకో రూ.లక్ష బదిలీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి ఖాతాకు సుమారు రూ.2 లక్షలు, పంప్ ఆపరేటర్ సయ్యద్ రహీమ్ ఖాతాకు సుమారు రూ.3 లక్షలు బదిలీ చేసినట్లు ఆరోపించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన కారణాలు, అనుమతులు, బిల్లుల వివరాలను పరిశీలించి పారదర్శకతను నిర్ధారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బాత్‌రూమ్‌ల నిర్మాణ ఖర్చుపై అనుమానాలు

గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు బాత్‌రూమ్‌ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.14 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపడంపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఎంత ఖర్చు చేశారు? నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరిగాయనే అంశాలపై పనుల అంచనాలు, కొలతల పుస్తకాలు, బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఖాతా నుంచి నగదు బదిలీ సమయంలో ఉపసర్పంచ్‌కు ఓటీపీలు, ఎస్ఎంఎస్ సమాచారం అందలేదని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. లావాదేవీల అనుమతులు, బ్యాంకు రికార్డులు, డిజిటల్ వివరాలపై విచారణ జరపాలని కోరారు.

తాగునీటి సమస్యపై తీవ్ర వివాదం….Raghunathapalem Fund Diversion

గ్రామంలోని 13వ వార్డు పరిధిలోని చందర్రావు నగర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం ఓ నివాసి తన సొంత ఖర్చులతో బోరు వేయించేందుకు ముందుకు రాగా బోరు బండిని తగలబెడతానంటూ సర్పంచ్ భర్త నర్సింహారావు బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించిన వార్డు వాసులను దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. అలాగే సర్పంచ్ కమని కుమారి గ్రామంలో నివాసం ఉండకుండా కోదాడలో ఉంటున్నారని, నిధుల లావాదేవీల సమయంలో మాత్రమే పంచాయతీకి వస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ భర్త అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పంచాయతీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

స్వతంత్ర ఆడిట్ నిర్వహించి చర్యలు తీసుకోవాలిRaghunathapalem Fund Diversion

ప్రజాధనం వినియోగంలో పారదర్శకత పాటించాలని, ప్రతి రూపాయికీ లెక్క చూపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి వెంటనే స్పందించి పంచాయతీ బ్యాంకు స్టేట్‌మెంట్లు, చెక్కులు, వోచర్లు, బిల్లులు, డిజిటల్ చెల్లింపులతో పాటు నిర్మాణ పనుల నాణ్యతపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.రఘునాథపాలెం పంచాయతీలో నిధుల వినియోగంపై వస్తున్న ఆరోపణలపై అధికారుల విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News