Homeఆరోగ్యంAir Pollution Deaths | పీల్చే గాలి ఉసురు తీస్తుంది..

Air Pollution Deaths | పీల్చే గాలి ఉసురు తీస్తుంది..

  • గాలి కాలుష్యంతో పెను ప్రమాదం..Air Pollution Deaths
  • వెల్లడించిన వైద్య నిపుణులు..

దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నివారణ గురించి చర్చించినప్పుడు ఉప్పు, చక్కెర, పొగాకు వినియోగం, వ్యాయామం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పీల్చే కలుషిత గాలి ప్రభావాన్ని మాత్రం ఆరోగ్య కార్యక్రమాల్లో తగినంతగా పరిగణించడం లేదు. గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళికణాలు శరీరంలోకి ప్రవేశించి రక్తనాళాల్లో వాపును పెంచుతాయి. ధమనులను గట్టిపరచడం, రక్తపోటును పెంచడం, ఇన్సులిన్ పనితీరును దెబ్బతీయడం వంటి ప్రభావాలు చూపుతాయి. వీటి కారణంగా పక్షవాతం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగతాగని వారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇవి కారణమవుతాయి. 2025లో ప్రచురితమైన లాన్సెట్ ఆరోగ్య, వాతావరణ మార్పుల నివేదిక ప్రకారం..Air Pollution Deaths

2022లో భారత్‌లో పీఎం2.5 కాలుష్యం కారణంగా సుమారు 17.2 లక్షల మంది మరణించారు. 2010తో పోలిస్తే ఈ సంఖ్య 38 శాతం పెరిగింది. పది నగరాల్లో 2008 నుంచి 2019 వరకు జరిగిన మరణాలను పరిశీలించిన 2024 అధ్యయనం ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి మించిన కాలుష్యం కారణంగా మొత్తం మరణాల్లో 7.2 శాతం సంభవించాయి. ఢిల్లీలో ఈ వాటా అత్యధికంగా 11.5 శాతంగా నమోదైంది. పీఎం2.5 స్థాయిలో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలతో రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరిగింది. కాలుష్యం అనుమతించిన పరిమితుల్లో ఉన్న రోజుల్లో కూడా మరణాల ప్రమాదం పెరుగుతున్నట్లు పరిశోధన వెల్లడించింది. వాయు కాలుష్యం వల్ల 2022లో భారత్‌కు సుమారు 339.4 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News