- ముందస్తు ప్రణాళిక లేకనే తీవ్ర రూపం దాల్చుతున్న కరువుWarangal Drought Relief
- వరంగల్ జిల్లాను తీవ్ర కరువు ప్రాంతంగా ప్రకటించాలి
- కరువును శాస్త్రీయంగా అంచనా వేసి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి
- ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్
- ఎంసీపీఐ(యు), ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో రైతుల పంట పొలాల సందర్శనWarangal Drought Relief
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయని, ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి తక్షణమే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎంసీపీఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
ఎంసీపీఐ(యు), అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట, గిర్నిబావి, మందపల్లి, చాపలబండ, అడవిరంగాపురం గ్రామాల్లో పర్యటించి రైతుల పంట పొలాలను సందర్శించింది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను అడిగి తెలుసుకుంది.Warangal Drought Relief
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, చెరువులు, కుంటలు, బోర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతుల పంటలు సరైన దిగుబడి రాకముందే ఎండిపోతున్నాయని, దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోందని అన్నారు.
జిల్లాలో సుమారు 2 లక్షల 90 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసినప్పటికీ, కనీసం 50 శాతం విస్తీర్ణంలో కూడా ఆశించిన దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా కరువు తీవ్రతను అంచనా వేయకుండా కేవలం ఎనిమిది మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించడం అన్యాయమని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వరంగల్ జిల్లాను తీవ్ర కరువు ప్రాంతంగా ప్రకటించాలని, తక్షణమే ప్రత్యేక నిధులు కేటాయించి రైతులకు, వ్యవసాయ కూలీలకు కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఏఐకేఎఫ్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబురావు మాట్లాడుతూ, కరువు కారణంగా పంటల దిగుబడులు కోల్పోయిన రైతులకు వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున, ఇతర పంటలకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక కరువు సహాయక నిధులు కేటాయించేలా అధికార బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.
అలాగే పశుగ్రాసం, తాగునీరు, సాగునీటి ఎద్దడి నివారణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.Warangal Drought Relief
ఈ పంట పొలాల సందర్శనలో ఎంసీపీఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్, మండల కార్యదర్శి సింగతి మల్లికార్జున్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగెల్లి కొమురయ్య, మండల సహాయ కార్యదర్శి ఏల్లబోయిన రాజు, నాయకులు నాగెల్లి భాస్కర్, తడుక కౌసల్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
