Homeస్పోర్ట్స్Yuzvendra Chahal | రికార్డ్ సృష్టించిన చాహల్..

Yuzvendra Chahal | రికార్డ్ సృష్టించిన చాహల్..

  • టి – 20 ఫార్మేట్ లో 400 వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్నర్..Yuzvendra Chahal
  • టి – 20 కెరీర్ లో 246 మ్యాచ్ లో ఈ ఘనత..

భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో 400 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో భాగంగా, హరియాణా తరఫున ఆడుతున్న చాహల్.. బుధవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ రికార్డుకు కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్న చాహల్, అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో, తమిళనాడు జట్టు 124 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ప్రదర్శనతో, చాహల్ తన టీ20 కెరీర్‌లో మొత్తం వికెట్ల సంఖ్యను 402కు (246 మ్యాచ్‌లలో) పెంచుకున్నాడు. ఈ ఘనతతో, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో చాహల్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అతడి తర్వాత భువనేశ్వర్ కుమార్ (366), జస్ప్రీత్ బుమ్రా (354), పీయూష్ చావ్లా (329), రవిచంద్రన్ అశ్విన్ (323) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News