- జిల్లా మైనింగ్ ఆర్ ఐ నాగమణిIllegal soil excavation
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపట్టి (Illegal soil excavation), అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ ఆర్ ఐ నాగమణి హెచ్చరించారు. జిల్లా ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు గురువారం మేడ్చల్ రెవెన్యూ పరిధిలోని గుండ్లపోచంపల్లి జాతీయ రహదారిపై జరుగుతున్న సెల్లార్ నిర్మాణ పనులను మైనింగ్ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపట్టి, తవ్విన మట్టిని బయటకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ మట్టి తవ్వకాలు, రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి మాత్రమే తవ్వకాలు చేపట్టాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
