Homeఅంతర్జాతీయంSatya Nadella| విచారం వ్యక్తం చేసిన సత్య నాదెళ్ల..

Satya Nadella| విచారం వ్యక్తం చేసిన సత్య నాదెళ్ల..

  • ఇటీవల మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయం..Satya Nadella
  • మరింత మెరుగ్గా పనిచేసి వుండాల్సిందన్న సత్య..

ఇటీవల మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో తలెత్తిన భారీ ప్రపంచవ్యాప్త అంతరాయంపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో యూజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈ సమస్యను ముందే నివారించడంలో తాము మరింత మెరుగ్గా పనిచేసి ఉండాల్సిందని ఆయన అంగీకరించారు. సీఎన్‌బీసీతో మాట్లాడిన ఆయన.. సాఫ్ట్‌వేర్‌లో నిద్రాణంగా ఉన్న ఒక బగ్ ఒక్కసారిగా నిర్దిష్ట యూజర్ ట్రాఫిక్‌ను ఎదుర్కోవడంతోనే ఈ వ్యవస్థ కుప్పకూలిందని స్పష్టం చేశారు.

టెస్టింగ్ ప్రక్రియలోనే ఇలాంటి లోపాలను గుర్తించడంలో విఫలమయ్యామని, ఒక చిన్న లోపం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుని ఉండాల్సిందని నాదెళ్ల పేర్కొన్నారు. గత వారం తొలుత ఔట్‌లుక్‌లో మొదలైన ఈ అంతరాయం.. ఆ తర్వాత క్రమంగా టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్ వంటి కీలక సేవలన్నింటికీ పాకింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు దాదాపు ఒక రోజుకు పైగా సేవలందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఏడాది మొదట్లోనే సిస్టమ్‌లోకి ప్రవేశించిన ఈ సాఫ్ట్‌వేర్ బగ్‌తో పాటు, విపరీతమైన ట్రాఫిక్, సర్వర్ సామర్థ్యం తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తేలింది. అయితే దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి ఆనవాళ్లు లేవని సంస్థ స్పష్టం చేసింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News